మీ కొనుగోళ్లు, రిజర్వేషన్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లను కనుగొనండి

మీ Google ఖాతాలో Search, Maps, అలాగే మీ Assistantను ఉపయోగించి చేసిన కొనుగోళ్లు, రిజర్వేషన్‌లు ఉంటాయి. ఈ సమాచారం, పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడేలా ఆర్గనైజ్ చేయబడుతుంది.

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. ఎడమ వైపున, పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఐటెమ్‌ల లిస్ట్‌ను చూడటానికి, కొనుగోళ్లను మేనేజ్ చేయండిసబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి, లేదా రిజర్వేషన్‌లను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  4. మరిన్ని వివరాలను పొందటానికి, ఐటెమ్‌ను ఎంచుకోండి. ఇక్కడ, మీరు ఇలాంటి చర్యలను తీసుకోవచ్చు:
    • డెలివరీని ట్రాక్ చేయవచ్చు.
    • సబ్‌స్క్రిప్షన్‌ను రీ-యాక్టివేట్ చేయవచ్చు.
    • రిజర్వేషన్‌ను రద్దు చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు 13 ఏళ్ల లోపు లేదా మీ దేశంలో వర్తించే వయస్సు ఉన్న యూజర్ అయితే, మీ Google ఖాతా Family Linkతో తల్లి/తండ్రి ద్వారా మేనేజ్ చేయబడుతుంది. మీ Google ఖాతాలో లిస్ట్ చేయబడిన కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు, లేదా రిజర్వేషన్‌లు ఏవీ మీకు కనిపించవు.  

చిట్కా: Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో ఫ్యామిలీ మెంబర్‌లు చేసిన అన్ని కొనుగోళ్ల లిస్ట్‌ను ఫ్యామిలీ మేనేజర్ చూడగలరు. ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోండి.

మీ కొనుగోళ్లు, రిజర్వేషన్‌ల సమాచారం ఎక్కడి నుండి తీసుకోబడుతుంది

మీ Google ఖాతాలో Search, Maps, అలాగే మీ Assistantను ఉపయోగించి చేసిన కొనుగోళ్లు, రిజర్వేషన్‌లు ఉంటాయి. ఉదాహరణకు, కొనుగోళ్లు, రిజర్వేషన్‌లు వీటి నుండి రావచ్చు:

  • Search లేదా Assistant ద్వారా చేసిన ఆహార ఆర్డర్‌లు లేదా Google షాపింగ్ ఆర్డర్‌ల నుండి
  • Search, Maps, లేదా Assistantను ఉపయోగించి క్రియేట్ చేసిన రెస్టారెంట్‌ల, హోటళ్ల రిజర్వేషన్‌లు, అలాగే ఆరోగ్యానికి, ఇంకా ఫిట్‌నెస్‌కు సంబంధించిన బుకింగ్‌ల నుండి

ఆర్డర్ సోర్స్‌ను తెలుసుకోవాలంటే, ఆ ఆర్డర్‌ను ఎంచుకొని దాని వివరాలను చూడండి. ఎగువున కుడి వైపున ఉన్న, సమాచారం, సమాచారం ఆ తర్వాత ఇది ఎక్కడి నుండి వచ్చింది?ని ఎంచుకోండి.

మీ కొనుగోళ్లను, రిజర్వేషన్‌లను తొలగించండి

మీ కొనుగోళ్లను తొలగించండి
  1. మీ Google ఖాతాలోని కొనుగోళ్ల పేజీకి వెళ్లండి.
  2. ఏదైనా ఒక కొనుగోలుకు సంబంధించిన వివరాలను కనుగొనడానికి, దానిని ఎంచుకోండి.
  3. కొనుగోలును తీసివేయిని ఎంచుకోండి.
  4. కొనుగోలును తొలగించడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
మీ రిజర్వేషన్‌లను తొలగించండి
  1. మీ Google ఖాతాలోని రిజర్వేషన్‌ల పేజీకి వెళ్లండి.
  2. ఏదైనా ఒక రిజర్వేషన్‌కు సంబంధించిన వివరాలను కనుగొనడానికి, దానిని ఎంచుకోండి.
  3. రిజర్వేషన్‌ను తీసివేయిని ఎంచుకోండి.
  4. రిజర్వేషన్‌ను తొలగించడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

ముఖ్య గమనిక: మీ కొనుగోళ్లు, రిజర్వేషన్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు సంబంధించిన సమాచారం, ఇతర Google సర్వీస్‌లలో మీ యాక్టివిటీతో పాటు కూడా సేవ్ చేయబడవచ్చు. ఉదాహరణకు, మీరు Searchను ఉపయోగించి ప్రోడక్ట్‌ను చూసి, దానిని కొనుగోలు చేసి ఉంటే, ఆ ప్రోడక్ట్‌కు సంబంధించి మీరు చేసిన సెర్చ్‌లు మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు.

Google మీ కొనుగోళ్లను, రిజర్వేషన్‌లను ఎందుకు ఒక చోట స్టోర్ చేస్తుంది

పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి, మీ Google ఖాతాలో మీ కొనుగోళ్లను, అలాగే రిజర్వేషన్‌లను మేము ఆర్గనైజ్ చేస్తాము. ఉదాహరణకు:

  • మీరు చేసిన కొనుగోలుకు సంబంధించిన షిప్పింగ్ స్టేటస్ గురించి మీరు మీ Google Assistantను అడగవచ్చు.
  • మీ విమాన రిజర్వేషన్‌లను చూపించమని మీరు మీ Google Assistantను అడగవచ్చు, లేదా "నా విమానం సమయానికే వస్తుందా?" వంటి ప్రశ్నలను అడగడానికి మీరు Searchను ఉపయోగించవచ్చు.

లింక్ చేసిన సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి

సబ్‌స్క్రిప్షన్‌లలో ఇలాంటి కంటెంట్ ఉండవచ్చు:

  • Google Play సబ్‌స్క్రిప్షన్‌లు
  • YouTube సబ్‌స్క్రిప్షన్‌లు
  • మీ Google ఖాతాతో మీరు లింక్ చేసిన News సబ్‌స్క్రిప్షన్‌లు
Google వెలుపల నుండి సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను జోడించండి

మీ Google ఖాతాకు మీరు సబ్‌స్క్రిప్షన్‌ను లింక్ చేయవచ్చు.

మీరు మీ ఖాతాకు సబ్‌స్క్రిప్షన్‌ను లింక్ చేసిన తర్వాత, Google ఇలాంటి అనుభవాలను వ్యక్తిగతీకరించగలదు:

  • ఖాతాకు సైన్ ఇన్ చేయకుండానే లేదా 'పేమెంట్‌తోనే ప్రవేశం' ద్వారా వెళ్లకుండానే ఆర్టికల్‌లను కనుగొనడం.
  • మీ సెర్చ్ ఫలితాలలో ప్రింట్ సబ్‌స్క్రిప్షన్‌ల నుండి ఆర్టికల్‌లను పొందడం.
లింక్ చేసిన సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండి

మీ Google ఖాతాలో ఏదైనా ఒక సబ్‌స్క్రిప్షన్ కనబడకూడదని మీరు అనుకుంటే, సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్లి, అన్‌లింక్ చేయిని ఎంచుకోండి.

మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడదు లేదా మార్చబడదు. కానీ మీరు Google ప్రోడక్ట్‌లలో మీ సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైన వ్యక్తిగతీకరణను ఇకపై చూడలేరు.

మీ కొనుగోళ్లను, రిజర్వేషన్‌లను ఎవరు చూడగలరు

మీ కొనుగోళ్లను, రిజర్వేషన్‌లను, అలాగే సబ్‌స్క్రిప్షన్‌లను మీరు మాత్రమే చూడగలరు. మీ గోప్యతను, సెక్యూరిటీని Google ఎలా సంరక్షిస్తుందో తెలుసుకోండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2589610778898664811
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false